అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి... చంద్రబాబు దిగ్భ్రాంతి

  • లారీ కిందికి దూసుకెళ్లి నుజ్జునుజ్జయిన కారు
  • తాడిపత్రిలో ఇస్కాన్ నగర సంకీర్తన నుంచి తిరిగొస్తుండగా ఘటన
  • మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు
  • బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీ కిందికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు అయింది. 

మృతులు అనంతపురం ఇస్కాన్ ప్రార్థన మందిరం భక్తులుగా గుర్తించారు. వారు తాడిపత్రి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

కాగా, అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Road Accident
Anantapur District
ISKCON
Chandrababu
TDP-JanaSena-BJP Alliance

More Telugu News